రాజా వారు - రాణి వారు అంటూ హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయిన కిరణ్ అబ్బవరం.. వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా అయితే మారాడు. SR కల్యాణ మండపం ఓకే అనిపించినా, సెబాస్టియన్ 524 అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చినా ఆ సినిమా ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా లేకపోవడంతో ఫలితాలు తేడా కొట్టాయి. ఆ సినిమాలు కిరణ్‌కి సక్సెస్ ఇవ్వలేదు. అయినా పలు ప్రాజెక్ట్స్‌ని లైన్ లో పెట్టిన కిరణ్ కి వచ్చే శుక్రవారం విడుదల కాబోయే సమ్మతమే చిత్రమైనా హిట్ ఇస్తుంది అని నమ్మకంతో ఉన్నాడు.
ఆ సినిమా లో చాందిని చౌదరితో రొమాన్స్ చేస్తున్న కిరణ్ అబ్బవరం సమ్మతమే చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ చేస్తున్నాడు. అలాగే రీసెంట్ గానే మరో మూవీ మొదలు పెట్టాడు. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నా అందులో ఒక్క సినిమా అయినా హిట్ అయితేనే కదా మనోడు హీరోగా సెటిల్ అయ్యేది. లేదంటే కష్టమే. సమ్మతమే అయినా కిరణ్ కి సక్సెస్ ఇవ్వాలని కోరుకుందాం.