నాని - వివేక్ ఆత్రేయ కలయికలో ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా గత శుక్రవారమే రిలీజ్ అయ్యింది. చిన్నప్పటినుండి ఫ్రెండ్స్ అయిన సుందర్(నాని) - లీల(నాజ్రియా) పెళ్లి చేసుకోవాలనుకుంటే.. సుందర్ వాళ్ళ నాన్న బ్రాహ్మిణ్స్, లీల వాళ్ళ నాన్న క్రిస్టియన్ అవడమే కాదు, వారికి మతాల పట్ల విపరీతమైన ప్రేమ ఉంటుంది. వేరే మతం వాళ్ళని గిట్టనివ్వరు. అలాంటివారిని ఒప్పించి సుందర్ - లీలా ఎలా పెళ్లి చేసుకున్నారో అనేది అంటే సుందరానికి కథ.
అయితే జనవరి 10 న థియేటర్స్ లో రిలీజ్ అయిన అంటే సుందరానికి సినిమా కి మంచి టాక్ వచ్చింది. సినిమా హిట్టే అన్నారు. కానీ కలెక్షన్స్ పరంగా సినిమా వీకైపోయింది. ప్రస్తుతానికి థియేటర్స్ రన్ కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి. అందుకే త్వరలోనే అంటే సుందరానికి సినిమాని ఓటిటిలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. జులై 8 న ప్రముఖ ఓటిటి ఛానల్ నుండి అంటే సుందరానికి రిలీజ్ కాబోతుంది. సో థియేటర్లు నుండి అంటే సుందరానికి జులై 8 న మీ ఇంట్లోకే, గెట్ రెడీ నాని ఫాన్స్.