ఢీ డాన్స్ షోలో సరైన మెంటర్స్ లేరు. ఢీ 14 లో ప్రదీప్ యాంకర్ గాను, ఆది, రవి కృష్ణ, నవ్య స్వామి మెంటర్స్ గాను కొనసాగుతున్నారు. ముందు బిగ్ బాస్ అఖిల్ మెంటర్ గా వచ్చినా అతను మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్లడంతో.. ఆ ప్లేస్ లోకి రవి కృష్ణ, నవ్యస్వామి వచ్చారు. ఇక లేడీ కంటెస్టెంట్స్ కి మెంటర్ గా మరో సీరియల్ ఆర్టిస్ట్ వచ్చినా.. ఆమె ఇప్పుడు కనిపించడం లేదు. గతంలో సుధీర్ - రష్మీ లు మెంటర్స్ గా స్టేజ్ పై సందడి చెయ్యడమే కాదు, కామెడీ తో, రొమాన్స్ తో ఆకట్టుకునేవారు. కానీ ఈ సీజన్ లో సుధీర్ - రష్మీ లు డాన్స్ షో నుండి తప్పుకున్నారు.
అప్పటినుండి షో లో కళ లేదు, రొమాన్స్ లేదు. ఇప్పుడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఢీ డాన్స్ షో కి బై బై చెప్పెయ్యబోతున్నాడనే న్యూస్ మొదలయ్యింది. మేల్ యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న ప్రదీప్ మాచిరాజు.. యాంకర్ గా ఢీ డాన్స్ షో లో కామెడీ చెయ్యడం, ఆది, సుధీర్ లని ఆటపట్టిస్తూ ఎంటర్టైన్ చేస్తుండేవాడు. అలాగే జెడ్జెస్ తో మంచి రాపో మెయింటింగ్ చేసే ప్రదీప్ కంటెస్టెంట్స్ తోనూ కలివిడిగా ఉండేవాడు. అలాంటి ప్రదీప్ కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయంటూ.. ఢీ షో కి గుడ్ బై చెప్పయ్యబోతున్నాడంటూ ప్రచారం గట్టిగానే జరుగుతుంది.