Advertisement
Google Ads BL

పూజ హెగ్డే పై షాకింగ్ న్యూస్


రాధే శ్యామ్ సినిమా షూటింగ్ సమయంలో పూజ హెగ్డే ప్రభాస్ ఇంకా రాధే శ్యామ్ టీం ని ఇబ్బంది పెట్టిన కారణంగా ప్రభాస్ ఆమెతో రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో పాల్గొనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నారు. అలాగే ప్రెస్ మీట్ లోను మేడం అంటూ మాట్లాడారు కానీ, పూజ హేగ్డ్ పేరు పలకడానికి ఇష్టపడలేదు అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు బీస్ట్ సినిమా షూటింగ్ టైం లో పూజ హెగ్డే చేసిన ఖర్చు చూసిన నిర్మాత అవాక్కవడమే కాదు, తిరిగి పూజ హేగ్డ్ కి షాకిచ్చినట్లుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. బీస్ట్ షూటింగ్ టైం లో పూజ హెగ్డే ఫుడ్ ఖర్చులు, ఆమె మెయింటినెన్స్ ఖర్చులకి లక్షల్లో బిల్ అయ్యిందట.

Advertisement
CJ Advs

తాజాగా ఆ బిల్స్ బీస్ట్ నిర్మాతకు అందడంతో నిర్మాతలు షాకయ్యారట. అసలే బీస్ట్ మూవీ ప్లాప్. మధ్యలో మళ్లీ హీరోయిన్ కోసం ఇంత ఖర్చా.. అంటూ అవాక్కయ్యారట. దానితో బీస్ట్ నిర్మాతలు ఈ బిల్లులతో తమకు సంబంధం లేదని, పూజ స్టాఫ్‌కు అయిన ఖర్చులను ఆమె పర్సనల్ గా భరించాలంటూ నిర్మాతలు ఆ బిల్లును పూజాకు పంపినట్లు సమాచారం. ఇక సినిమా కూడా పోవడంతో పూజ హెగ్డే గుట్టుగా తన బిల్లు తానే కట్టుకోవాలని నిర్ణయం తీసుకుంది అనే టాక్ కూడా మొదలయ్యింది. గతంలోనూ ఓ డైరెక్టర్ పూజ హెగ్డే అంటే కాస్ట్లీ వ్యవహారం అని, ఆమెతో సినిమా అంటే నిర్మాతలకి భారం అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

Beast Producers Shock To Pooja Hegde:

Pooja hegde unnecessary expenses burden to the Producers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs