Advertisement
Google Ads BL

అక్కినేని ఫాన్స్ కి సమంత రిప్లై


సమంత - నాగ చైతన్య విడాకుల తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయినా.. సమంత తన స్టైలిస్ట్ ప్రీతం తో రిలేషన్ లో ఉంది అనే రూమర్, అలాగే చైతు తో విడాకుల తర్వాత సమంత గ్లామర్ రోల్స్ కే ప్రాధాన్యత ఇస్తుంది, అందాలు ఆరబోసే విషయంలో రోజు రోజుకీ శృతి మించిపోతుంది అంటూ చాలామంది కామెంట్స్ చేసారు. అయితే నాగ చైతన్య మాత్రం సైలెంట్ గా తన సినిమాల షూటింగ్స్ లో బిజీగా మారాడు. కానీ ఉన్నట్టుండి నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో రిలేషన్ లో ఉన్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Advertisement
CJ Advs

అసలు నాగ చైతన్య శోభిత దూళిపాళ్లతో డేటింగ్ ఏమిటి.. ఇదంతా సమంత పీఆర్ టీం కావాలనే స్ప్రెడ్ చేస్తుంది అని, ఈ రూమర్స్ అన్ని సమంత పీఆర్ టీం పనే అని, చైతన్య ఇమేజ్ డ్యామేజ్ చెయ్యడానికి ఇదంతా చేస్తున్నారంటూ అక్కినేని ఫాన్స్ సమంత పై ఫైర్ అవుతున్నారు. దానితో చిర్రెత్తుకొచ్చిన సమంత అక్కినేని ఫాన్స్ కి ఓ వార్నింగ్ ట్వీట్ వేసింది.. అమ్మాయిలపై పుకార్లు వస్తే.. అది నిజమే కానీ, అబ్బాయిలపై పుకార్లు వస్తే మాత్రం అదంతా అమ్మాయే చేయించింది అంటారా.. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. మీ పని మీద, మీ కుటుంబాల విషయాల మీద ఏకాగ్రత పెట్టండి అంటూ ఘాటైన ట్వీట్ చేసి మరీ రిప్లై ఇచ్చింది. 

 

Samantha Strong Reply on Naga Chaitanya Dating Rumors:

Samantha strong message regarding ex-husband Naga Chaitanya dating actress
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs