Advertisement
Google Ads BL

కెజిఎఫ్ లో ఏ పాత్రకైనా సై అంటున్న హీరోయిన్స్


కెజిఎఫ్ ఫ్రాంచైజీ పాన్ ఇండియా మార్కెట్ లో ఎన్ని సంచలనాలను క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. రాఖి భాయ్ గా యశ్, దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఇద్దరికీ విపరీతమైన క్రేజ్ రావడమే కాదు, ఆ సినిమాలో నటించిన నటీనటులకు, హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి మ్యూజిక్ డైరెక్టర్ కి అందరికి మంచి పేరు వచ్చింది. అయితే కెజిఎఫ్ 2 కి సీక్వెల్ గా కెజిఎఫ్ 3 ఉండబోతుంది అని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకి ఎక్కువగా బాలీవుడ్ టచ్ ఇవ్వబోతున్నారనే టాక్ నడిచింది. అందులో భగంగానే హ్రితిక్ రోషన్ KGF3 లో కీలక పాత్రలో కనిపించబోతున్నారని అన్నప్పటికీ.. కెజిఎఫ్ మేకర్స్ దానిని కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు KGF 3 లో నటించేందుకు హీరోయిన్స్ ఉవ్విళ్లూరుతున్నారట.

Advertisement
CJ Advs

చిన్న రోల్ అయినా పర్లేదు.. ఆ సినిమా ఛాన్స్ వస్తే చాలు అన్నట్టుగా చూస్తున్నారట. కెజిఎఫ్ లో శ్రీనిధి శెట్టి నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. ఆమె సీన్స్ అన్ని బావుంటాయి. కెజిఎఫ్ 2 లో శ్రీనిధి శెట్టి ని విలన్స్ చంపేస్తారు. అందుకే కెజిఎఫ్ 3 కోసం ఎవరో ఒక హీరోయిన్ ని కంపల్సరీ తీసుకోవాలి. సో నిడివి తక్కువ ఉన్నా ఆ ఛాన్స్ తమకే రావాలని బాలీవుడ్ బ్యూటీస్ ఎదురు చూస్తున్నారని అంటున్నారు. కెజిఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీ ఒక్కటి పడితే చాలు కెరీర్ టర్న్ అవ్వడానికి.. అందుకే ఈ ఆరాటం.

A Big Bollywood Star Opposite Yash In KGF 3? Top Actresses Send Feelers To The Makers:

KGF Chapter 3: A-list Bollywood Actresses Sending Feelers to Feature in Yash Starrer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs