కెరీర్ బిగినింగ్ లోనే తనకి డైరెక్షన్ పై ఆసక్తి ఉంది అని ప్రకటించిన నిత్యా మీనన్ త్వరలోనే ఆ దిశగా అడుగులు వెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నటిగా మంచి మార్కులు కొట్టేసిన నిత్యా సింగర్ గాను తన ప్రతిభ చూపించింది. ఏ భాషలో సినిమా చేసినా తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం ఆమెలో ఉన్న మరో ముఖ్యమైన క్వాలిటీ. తెలుగు, తమిళ, మలయాళం అన్ని లాంగ్వేజెస్ పైన పట్టు సాధించిన నిత్య.. ఈ తరం ప్రేక్షకులందరిని టార్గెట్ చేసేలా మల్టి లాంగ్వేజెస్ సినిమా చేయబోతుంది తన దర్శకత్వంలో.. మరిన్ని వివరాలు త్వరలోనే..
ప్రస్తుతం నిత్యా మీనన్ తనకి వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూనే తెలుగు ఇండియన్ ఐడల్ షో కి జేడ్జ్ గా వ్యవహరించింది. ఆహా లో ప్రసారమవుతున్న ఈ షో రీసెంట్ గానే ఫైనల్స్ తో ముగించేశారు.