Advertisement
Google Ads BL

నయనతార పాత్రని లీక్ చేసిన థమన్


మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరస ప్రాజెక్ట్స్ షూటింగ్స్ తో చాలా బిజీగా వున్నారు. గాడ్ ఫాదర్, మెగా 154, భోళా శంకర్ షూటింగ్స్ అంటూ చాలా బిజీగా తిరుగుతున్నారు. అయితే మెగాస్టార్ చిరు స్టార్ హీరోయిన్స్ ని చెల్లెళ్లుగా పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. భోళా శంకర్ లో కీర్తి సురేష్, గాడ్ ఫాదర్ లో నయనతార కి చిరు అన్నయ్యలా నటిస్తున్నారు. అయితే నయనతార గాడ్ ఫాదర్ లో సిస్టర్ కేరెక్టర్ చేస్తుంది అని అందరూ ఊహించుకోవడమే కానీ, ఆ విషయమై యూనిట్ ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు.

Advertisement
CJ Advs

కానీ తాజాగా ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పొరపాటున నోరు జారడంతో నయనతార పాత్రపై క్లారిటీ వచ్చేసింది. గాడ్ ఫాదర్ లో చిరంజీవి చెల్లెలిగా నయనతార నటిస్తుందట. ఈ విషయాన్ని మెగాస్టార్ ముందరే థమన్ చెప్పడం విశేషము. రీసెంట్ గా థమన్ - చిరు ఓ షో స్టేజ్ పై గాడ్ ఫాదర్ ముచ్చట్లు చెప్పారు. గాడ్ ఫాదర్ ఆగష్టు కానీ, సెప్టెంబర్ లో కానీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మెగాస్టార్ చెప్పారు. అదే ఈవెంట్ లో నయనతార చిరు కి చెల్లెలిగా కనిపిస్తుంది అని థమన్ రివీల్ చేసాడు. నయనతార ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ గాడ్ ఫాదర్ లో కంప్లీట్ చేసినట్లుగా తెస్తుంది.

నయనతార ఇపుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుని రెండు వారాలు భర్తతో కలిసి తన తల్లి దగ్గరకి కొద్ది రోజులు గడపడానికి కేరళ వెళ్ళింది. 

Nayanthara To Act As Sister To Megastar Chiranjeevi:

Music Director Thaman confirmed a Brother sister song for Chiranjeevi and Nayanthara in Godfather.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs