Advertisement
Google Ads BL

సాయి పల్లవి కి అండగా ప్రకాష్ రాజ్


సాయి పల్లవి ఈమధ్యన ఓ వివాదంలో ఇరుక్కుంది. కాశ్మీరీ పండిట్స్, గోవధ పై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. దానితో ఆమె నటించిన విరాట పర్వం మూవీని బాయ్ కాట్ చెయ్యాలని నానా గొడవ చేసారు. అయ్యితే విరాట పర్వం విడుదలైన రెండు రోజులకి సాయి పల్లవి ఓ వీడియో ద్వారా తాను అన్న వ్యాఖ్యలకు వివరణ ఇచ్చింది, తాను మాట్లాడిన మాటలు తప్పుగా అర్థమయ్యాయని.. అందుకు క్షమాపణలు చెప్పింది. తనను రైటా..? లెఫ్టా..? అని అడిగితే.. తాను ఏది కాదు న్యూట్రల్ అని చెప్పానని.. హింస అనేది ఏ రూపంలో ఉన్నా కూడా తప్పే.. కానీ మతాల పేరిట చేసే హింస మహా పాపం అని తాను చెప్పాలని అనుకున్నానని పేర్కొంది.

Advertisement
CJ Advs

ఇదే తన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం అని.. కానీ కొందరు మూకదాడిని సమర్థిస్తున్నారని చెప్పింది. అయితే తానొక డాక్టర్‌గా తనకు ఓ ప్రాణం విలువ తెలుసు అని.. అందరి ప్రాణాలు ఒక్కటేనంటూ చెప్పిన సాయి పల్లవి కి ప్రకాష్ రాజ్ మద్దతు ప్రకటించారు. సాయిపల్లవి మేము నీతోనే ఉన్నామంటూ, ముందు హ్యుమానిటినే అంటూ ఆయన సాయి పల్లవికి సపోర్ట్ చేసారు. సాయి పల్లవి వీడియో ని రీ ట్వీట్ చేసారు ఆయన. 

Prakash Raj Supports Sai Pallavi:

Prakash Raj expresses support for Sai Pallavi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs