Advertisement
Google Ads BL

NBK107 సెట్స్ లో శృతి హాసన్


బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న NBK107 ఫస్ట్ లుక్ తోనూ అలాగే ఫస్ట్ టీజర్ తో అంచనాలను సెట్ చేసింది. బాలకృష్ణ లుక్స్, ఆయన డైలాగ్ డెలివరీ సినిమాకి మెయిన్ హైలెట్స్ గా నిలవబోతున్నట్లుగా తెలుస్తుంది. గోపీచంద్ మలినేని బాలకృష్ణ ఓ పాత్రని చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చెయ్యగా, మరొకటి రొమాంటిక్ గా డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ పాత్రకే హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ ని తీసుకొచ్చాడు దర్శకుడు. బాలయ్య సినిమాలో శృతి హాసన్ అంటే మాములు హైప్ కాదు. అయితే హీరోయిన్ గా ఎంపికయ్యాక ఓపెనింగ్ లో జాయిన్ అయిన శృతి హాసన్.. షూటింగ్ లో ఈ రోజే జాయిన్ అయినట్లుగా మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు.

Advertisement
CJ Advs

క్రాక్ తో తనకు కం బ్యాక్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని అడగడంతో శృతి హాసన్ మళ్ళీ బాలయ్య తో ఆయన దర్శకత్వంలో సినిమా చేయబోతుంది. గోపీచంద్ తో శృతి హాసన్ ఉన్న పిక్ ని షేర్ చేస్తూ శృతి హాసన్ కి NBK 107 సెట్స్ లోకి ఆహ్వానం పలికారు మేకర్స్. ప్రస్తుతం NBK107 షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. త్వరలోనే NBK107 యూనిట్ ఓ 20 రోజుల పాటు లాంగ్ షెడ్యూల్ కోసం అమెరికాకి వెళ్లబోతుంది. 

Shruti Haasan joins NBK107 sets:

NBK107: Shruti Haasan enters the scene
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs