Advertisement
Google Ads BL

పవన్ దేవుడు కాదా..


పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ భజన చేసే బండ్ల గణేష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కాస్త దూరాన్ని పాటిస్తున్నట్లే కనబడుతుంది. కొన్నాళ్ల క్రితం పవన్ కళ్యాణ్ బిజీ అందుకే ఆయనతో సినిమా చేస్తానో లేదో అనే అర్ధంతో మాట్లాడాడు. ఎప్పుడూ దేవుడితో సినిమా, దేవరా అంటూ పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడే బండ్ల గణేష్ ఆయనతో సినిమా చేసే అవకాశం లేదు అన్నాడు. అయితే తాజాగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అవి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసినవే అనిపిస్తుంది. 

Advertisement
CJ Advs

మనల్ని కట్టుకున్నవాళ్ళని, మనం కన్నవాళ్ళని, మనల్ని కన్నవాళ్ళని మనం ప్రేమిద్దాం. కన్నవాళ్ళని, జన్మనిచ్చిన పిల్లలని ప్రేమగా చూసుకుందాం, మన తల్లితండ్రులు మన మీద ఎన్నో ఆశలతో ఉంటారు. మన పిల్లలకి మంచి దారి చూపిద్దాం. వీళ్ల మోజులో పడి మన పిల్లలను, మన అమ్మనాన్నలను అన్యాయం చేయొద్దంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ చెయ్యడం చూస్తే హీరోల మోజులో, వాళ్ళ మీద అభిమానంతో పిల్లలని, తల్లితండ్రులని పక్కనబెట్టొద్దు అంటూ చెప్పడమే కాకుండా బండ్ల గణేష్ తన ఇంట్లోని హాల్‌లో పవన్ కళ్యాణ్ ఫోటోను తీసేసి, తన తల్లిదండ్రుల ఫోటోను పెట్టుకున్నాడు. ఆ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ దేవుడు అని నమ్మే బండ్ల గణేష్ పవన్ ని పక్కనబెట్టేసినట్లే కనిపిస్తుంది. 

Bandla ganesh latest tweets viral:

Bandla ganesh latest pic goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs