Advertisement
Google Ads BL

వివాదంలో విరాట పర్వం


రానా - సాయి పల్లవి కలయికలో తెరకెక్కిన విరాట పర్వం మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతుంది. విరాట పర్వం సినిమా విడుదలకు ముందు సాయి పల్లవి గోవధ పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపగా, అప్పుడు విరాట పర్వం మూవీని బాన్ చెయ్యాలని కొంతమంది నెటిజెన్స్ అన్నప్పటికీ.. ఎలాంటి వివాదం లేకుండా సినిమా విడుదలైంది. కానీ ఇప్పుడు మరోసారి విరాట పర్వం మూవీ పై వివాదం మొదలయ్యింది.

Advertisement
CJ Advs

అది విరాట పర్వం మూవీలో నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే తెరకెక్కిన సినిమాలకు సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతులు ఇస్తుందని అంటూ సెన్సార్‌ బోర్డు అధికారి శిఫాలి కుమార్‌ పై విశ్వ హిందూ పరిషత్‌ విద్యానగర్‌ జిల్లా కార్యదర్శి కె.అజయ్‌ రాజ్‌ సుల్తాన్‌బజార్‌ పోలీసులకు శనివారం సాయంత్రం ఫిర్యాదు చెయ్యడమే కాదు, విరాట పరం మూవీని బాన్ చెయ్యాలంటూ, ఈ సినిమా శాంతి భద్రతలను భంగం కలిగించేదిలా ఉంది అంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో చాలా అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయని, ఈ సినిమా ప్రదర్శన ఇమ్మిడియట్ గా ఆపేయ్యాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. 

Virata Parvam lands in controversy:

Virata Parvam land in legal trouble
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs