ప్రస్తుతం దీపికా పదుకొనే హెల్త్ కండిషన్ పై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. రెండు రోజుల క్రితమే దీపికా పదుకొనే హార్ట్ బీట్ ఎక్కువవడంతో ప్రాజెక్ట్ కె షూటింగ్ స్పాట్ నుండి హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్లి చెకప్స్ చేయించుకుంది అని, దానితో ప్రాజెక్ట్ కె షూటింగ్ ఆగిపోయింది అని, దీపికా హెల్త్ ఇష్యుస్ తో ప్రాజెక్ట్ కె షూటింగ్ వాయిదా పడింది అంటూ వార్తలొస్తున్నాయి. అసలు దీపికకి ఏమైంది అనే విషయంలో ఒక్కరికీ క్లారిటీ లేకపోవడంతో అందరిలో అనుమానాలు ఎక్కువయ్యాయి. దానితో ప్రాజెక్ట్ కె నిర్మాత అశ్విని దత్ దీపికా హెల్త్ విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
అది దీపికా పదుకొనేకి రీసెంట్ గా కోవిడ్ వచ్చి తగ్గింది అని, ఆమె కోవిడ్ తగ్గాక యూరప్ వెళ్లి అక్కడినుండి డైరెక్ట్ గా హైదరాబాద్ ప్రాజెక్ట్ కె షూటింగ్ కి వచ్చేశారని, సినిమా సెట్స్‌లో ఉండగా దీపికా పదుకునెకి ఒంట్లో కాస్త నలతగా అనిపించడంతో ఆసుపత్రికి వెళ్లారు. బీపీ లో హెచ్చుతగ్గులు ఉండడంతో రిస్క్ తీసుకోకుండా ఆసుపత్రికి కి వెళ్లి అక్కడ చెకప్స్ చేయించుకుని అక్కడ నుంచి నేరుగా మళ్ళీ సెట్స్‌కు వచ్చారు.. అది కూడా గంటలోపే అని, ఇందులో టెన్షన్ పడాల్సిన పనేం లేదు అంటూ అశ్విని దత్ చెప్పుకొచ్చారు.