Advertisement
Google Ads BL

గుట్టు చప్పుడు కాకుండా హీరోయిన్ పెళ్లి


హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటలేక కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ప్రస్తుతం వెబ్ సీరీస్ లలో నటిస్తున్న మధు షాలిని గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడం అందరికి షాకిచ్చింది. గత లాక్ డౌన్ లో హీరోయిన్ ప్రణీత ప్రేమించిన వాడిని సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసినట్టుగా మధు షాలిని కూడా తన పెళ్లి తర్వాత ఫొటోస్ ని షేర్ చేసి అందరికి షాకిచ్చింది. ఈ మధ్యనే 9 అవర్స్ వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మధు షాలిని ఆ సీరీస్ ప్రమోషన్స్ లో హడావిడి చేసింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా మధు షాలిని తమిళ హీరోని కామ్ గా పెళ్లి చేసుకోవడమే ఆశ్చర్యాన్ని కలిగించింది. మధుశాలిని తమిళ హీరో అయిన గోకుల్ ఆనంద్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళ సినిమా పంచాక్షరంలో మధు శాలిని, గోకుల్‌ లు జంటగా నటించారు. ఆ సినిమా తోనే పరిచయం అయిన ఈ జంట ప్రేమలో పడింది అని, అలా ఆ ప్రేమ పెళ్లి పీటలవరకు వచ్చింది అని, జూన్ 16 న మధు షాలిని - గోకుల్ వివాహం జరిగినట్టుగా తెలుస్తుంది. హైద్రాబాద్‌లో తాజ్ కృష్ణలో ఈ పెళ్లి జూన్ 16న జరిగినట్టుగా తెలిసిన అభిమానులు షాకవుతున్నారు.

Madhu Shalini and Gokul Anand fairytale wedding:

Madhu Shalini marriage with Gokul Anand
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs