Advertisement
Google Ads BL

అఖిల్ ఏజెంట్ పై మళ్లీ అనుమానాలు


అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తో హిట్ కొట్టాక.. ఏజెంట్ అంటూ మాస్ మూవీ మొదలు పెట్టాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రా ఏజెంట్ గా అఖిల్ మేకోవర్ కి అక్కినేని ఫాన్స్ షాకయ్యారు. అలాగే ఆశ్చర్య పోయారు. ఏజెంట్ లుక్ లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ తో పాటుగా లాంగ్ హెయిర్ మెయింటింగ్ చేస్తున్నాడు. అయితే మొన్నామధ్యన అఖిల్ మాల్దీవుల వెకేషన్స్ లో చాలా రోజులు గడిపేసరికి.. అఖిల్ కి ఏజెంట్ దర్శకుడు సురేందర్ రెడ్డి కి విభేదాల కారణంగా సినిమా షూటింగ్ కి బ్రేక్ వచ్చింది అంటూ ప్రచారం జరిగింది.

Advertisement
CJ Advs

అంతలోనే ఏజెంట్ మేకర్స్ లైన్ లోకి వచ్చి ఏజెంట్ మనాలి షెడ్యూల్ అప్ డేట్ ఇచ్చారు. అయితే తాజాగా అఖిల్ ఏజెంట్ రిలీజ్ డేట్ విషయం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అసలైతే ఏజెంట్ మూవీ ఆగష్టు 12 న రిలీజ్ చేస్తున్నామంటూ గ్రాండ్ గా డేట్ ఇచ్చారు మేకర్స్. కానీ ఇప్పుడు ఏజెంట్ డేట్ మారొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆగష్టు నుండి దసరా కి ఏజెంట్ రిలీజ్ డేట్ మారినా మారొచ్చని, దసరా బరిలో అయితే పర్ఫెక్ట్ కలెక్షన్స్ వస్తాయని.. ఎలాగూ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మేకర్స్ మైండ్ సెట్ కూడా ఛాన్స్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.

Agent team changed the release date?:

Akhil showing power as Agent under chilling conditions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs