సౌత్ లో సక్సెస్ లేకపోతేనేమి.. బాలీవుడ్ లో వరస సక్సెస్ లతో దూసుకుపోతున్న కియారా అద్వానీ.. కార్తీక్ ఆర్యన్ తో కలిసి నటించిన భూల్ భూలయ్యా 2 బ్లాక్ బస్టర్ హిట్ అవడం, అదిరిపోయే కలెక్షన్స్ కొల్లగొట్టడంతో అమ్మడి సుడి బాగా తిరిగింది. సిద్ధార్త్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్న కియారా అద్వానీ ఈమధ్యన ప్రియుడితో బ్రేకప్ చేసుకుంది అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు అంటూ కియారా సంకేతాలు ఇచ్చేసింది. ఇక తాజాగా వరుణ్ ధావన్ తో కలిసి కియారా అద్వానీ జగ్ జుగ్ జీయో ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.
రీసెంట్ గానే మెట్రోలో ప్రయాణించిన ఈ జంట.. ప్రమోషన్స్ విషయంలో చాలా డిఫ్రెంట్ గా వెళుతుంటే కియారా అద్వానీ స్పెషల్ గ్లామర్ షో తో రెచ్చిపోతుంది. సారీస్ లోనే కాదు మోడరన్ డ్రెస్సులతోను కియారా అద్వానీ క్లివేజ్ షో కి యూత్ చొంగ కారుస్తున్నారు. ఆమె ప్రమోషన్స్ కి వెళ్లే సమయంలో సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్ ని షేర్ చేస్తుంది. ఆ పిక్స్ లో కియారా అద్వానీ అందాల ఆరబోతకు సోషల్ మీడియానే షేక్ అవుతుంది. తాజాగా బ్లూ కలర్ మోడరన్ డ్రెస్ లో కియారా చూపించాల్సిన అందాలను అందంగానూ గ్లామర్ గాను చూపించేసింది. క్లివేజ్ షో తో సెగలు రేపుతున్న కియారా అందాలను మీరు ఓ లుక్కెయ్యండి.