Advertisement
Google Ads BL

హ్యాట్రిక్ కొట్టేసినట్లే


సాయి పల్లవి అంటే ఇప్పుడు స్టార్ హీరోల రేంజ్, క్రేజ్ ఉన్న పేరు. సూపర్ టాలెంట్ యాక్ట్రెస్ సాయి పల్లవి సినిమా వస్తుంది అంటే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే హడావిడి థియేటర్స్ దగ్గర కనిపించేంత. అంత టాలెంటెడ్ హీరోయిన్ వరసగా మూడో హిట్ కొట్టేసినట్లే కనిపిస్తుంది. అంటే గత ఏడాది లవ్ స్టోరీ తో సూపర్ హిట్ కొట్టిన సాయి పల్లవి ఆ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా డాన్సర్ గా అద్భుతమైన పెరఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఇక అదే ఏడాది చివరిలో నాని తో శ్యామ్ సింగ రాయ్ తో సూపర్ హిట్ కొట్టింది. రోజీ గా, దేవదాసీగా సూపర్ క్యూట్ లుక్స్ తో సాయి పల్లవి నాట్యం తో ప్రేక్షకులు మైమరచిపోయారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు వెన్నెలగా విరాట పర్వం మూవీ తో సాయి పల్లవి మరో హిట్ కొట్టేసినట్లే. ఓవర్సీస్, ప్రీమియర్స్ షో టాక్ చూస్తే సాయి పల్లవి నటనకు ఆడియన్స్ ఫిదా అవడమే కాదు, సినిమాకి మిక్స్డ్ అండ్ హిట్ టాక్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది. విరాట పర్వం లో వెన్నెల గా సాయి పల్లవి అద్భుతమైన నటన కనబరిచింది అంటున్నారు. వెంకటేష్ చెప్పినట్టుగా ఆమెకి ఈ సినిమాతో ఉత్తమనటి అవార్డు గ్యారెంటీ అంటూ ఆడియన్స్ కామెంట్ చెయ్యడం చూస్తే సాయి పల్లవి హ్యాట్రిక్ హిట్ అందుకుంది అనిపిస్తుంది.

Virata Parvam premiers show talk:

Virata Parvam Premiere Show Public Talk 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs