Advertisement
Google Ads BL

టాలెంటెడ్ యాక్టర్ సినిమాకి ప్రమోషన్స్ లేవు


సపోర్టింగ్ కేరెక్టర్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని తర్వాత సోలో హీరోగా సత్తా చాటుతున్న సత్య దేవ్.. ఇప్పుడు బాలీవుడ్ లోను నటిస్తున్నాడు. అలాగే చిరంజీవి గాడ్ ఫాదర్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో కనిపించబోతున్న సత్యదేవ్ నటించిన గాడ్సే మూవీ నేడు శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఉమామహేశ్వరరావు ఉగ్ర రూపస్య, తిమ్మరుసు, బ్లఫ్ మాస్టర్ అంటూ హీరో గా సత్తా చాటిన ఈ టాలెంటెడ్ యాక్టర్ సినిమా వస్తుంది అంటే మేకర్స్ ఎంత హడావిడి చెయ్యాలి.

Advertisement
CJ Advs

కానీ గాడ్సే మేకర్స్ మాత్రం ఆ సినిమా ప్రమోషన్స్ ని పట్టించుకోలేదు. అసలు కొంతమందికి ఈ రోజు గాడ్సే రిలీజ్ అవుతున్న విషయమే తెలియదంటే అర్ధమవుతుంది.. ఆ ప్రమోషన్స్ ఎంత వీక్ గా ఉన్నాయో. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అంటే బడ్జెట్ లో సగం పెట్టి ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఓ టాలెంటెడ్ యాక్టర్ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తే అది ఆడేస్తుంది అనుకున్నారేమో మేకర్స్. అందుకే ప్రమోషన్స్ లేకుండానే గాడ్సే ని రిలీజ్ చేసేసారు. మీడియాలో హడావుడి లేదు, ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు.. ఇలాంటివేం లేకుండానే సినిమాకి ఓపెనింగ్స్ ఎలా వస్తాయో ఆ మేకర్స్ కే తెలియాలి. 

SathyaDev Godse Releasing on June 17th:

SathyaDev Godse Releasing in Theaters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs