Advertisement
Google Ads BL

సాయి పల్లవిపై కేసు నమోదు


సాయి పల్లవి ప్రస్తుతం విరాట పర్వం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇంటర్వూస్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ఆత్మీయ వేడుక, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ రోజు వైజాగ్ లో విరాట పర్వం ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్న సాయి పల్లవి పై హైదరాబాద్ లో కేసు నమోదు అయ్యింది. గోరక్షకులపై సాయిపల్లవి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ నేతలు ఆమెపై సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రీసెంట్ గా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూ లో కశ్మిరీ ఫైల్స్ సినిమాలో కశ్మీరీ పండిట్స్ ని వధించనట్టుగానే ముస్లిమ్స్ గోవధ చేస్తున్నారంటూ సంచలనంగా మాట్లాడి వివాదంలో పడిన విషయం తెలిసిందే.

Advertisement
CJ Advs

ఈ వ్యాఖ్యల ఫలితంగా సాయి పల్లవి పై నెటిజెన్స్ కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే.. కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తూ సాయి పల్లవిని, ఆమె నటించిన విరాట పర్వం మూవీని బ్యాన్ చెయ్యాలంటూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్న టైం లోనే.. భజరంగ్ దళ్ నేతలు సాయి పల్లవిపై పోలీస్ లకి కంప్లైంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవిపై చర్యలు తీసుకోవాలని భజరంగ్ దళ్ నేతలు పోలీస్ లని కోరగా.. పోలీస్ లు న్యాయ సలహా తీసుకుని సాయిపల్లవిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు భజరంగ్ దళ్ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది.

Complaint filed against actress Sai Pallavi:

Hyderabad: Complaint filed against actress Sai Pallavi for comments on Kashmiri Pandits
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs