రానా - సాయి పల్లవి కాంబోలో నక్సలైట్ నేపథ్యంలో వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం అన్ని అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకి రేపు శుక్రవారం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. భారీ ప్రమోషన్స్ తో విరాట పర్వం పై అంచనాలు పెంచేశారు రానా, సాయి పల్లవి. సాయి పల్లవి నటనకు ఉత్తమనటి గుర్తింపు రావడం ఖాయం అంటూ వెంకటేష్ విరాట పర్వం ఈవెంట్ లో చెప్పారు. ఇక రానా, సాయి పల్లవి, ప్రియమణి నక్సలైట్స్ లా కనిపించబోతున్న ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్ లోనే జరిగింది. ఏరియా ల వారీగా విరాట పర్వం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు మీ కోసం..
ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం 4 కోట్లు
సీడెడ్ 2 కోట్లు
మిగతా ఏరియాలు 5 కోట్లు
ఏపీ అండ్ టీఎస్ మొత్తం 11 కోట్లు
రెస్టాఫ్ ఇండియా 1 కోట్లు
ఓవర్సీస్ 2 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ విరాట పర్వం కి జరిగింది.