Advertisement
Google Ads BL

రామ్ చరణ్ మిస్.. రానా సారి


రామ్ చరణ్ - రానా మంచి దోస్త్ లు. చిన్నప్పటినుండి ఇప్పటివరకు వీరిద్దరూ స్నేహితులుగానే ఉన్నారు. అయితే తాజాగా రానా నటించిన విరాట పర్వం మూవీ ఈవెంట్ కి రామ్ చరణ్ గెస్ట్ గా రావాల్సి ఉంది. వెంకటేష్ - రామ్ చరణ్ లు గెస్ట్ లుగా విరాట పర్వం ఈవెంట్ ప్లాన్ చేసి ప్రకటించారు మేకర్స్. రానా - సాయి పల్లవి, వెంకీ అందరూ విరాట పర్వం ఈవెంట్ లో కనిపించారు కానీ.. ఫంక్షన్ పూర్తవుతున్నా రామ్ చరణ్ రాలేదు. దానితో చరణ్ ఫాన్స్ డిస్పాయింట్ మూడ్ లో కనిపించారు. అయితే రామ్ చరణ్ తన పదవ పెళ్లి రోజు వేడుకల కోసం ఫ్లోరెన్స్ వెళ్లారు.

Advertisement
CJ Advs

అక్కడి నుండి బయలు దేరిన రామ్ చరణ్ కి ఫ్లైట్ మిస్ అవడంతో ఆయన విరాట పర్వం ఈవెంట్ ని మిస్ అయ్యారు రానా స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడబోయేలోపే.. చెర్రీ ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్.. రామ్ చరణ్ అంటూ కేకలు వేశారు.. దానితో రానా రామ్ చరణ్ ఫాన్స్ కి సారి చెప్పారు. ఇక్కడికి వచ్చిన రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ నాదో రిక్వెస్ట్. చరణ్ ఫ్లైట్ మిస్ అయి ఇంకా హైదరాబాద్‌కు చేరుకులేదు. అందుకే ఈ వేడుకకు హాజరుకాలేకపోతున్నాడు. రామ్ చరణ్ రాలేకపోయినందుకు ఆయన తరుపున మీ అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నా అంటూ చరణ్ రాలేని కారణాన్ని వివరించాడు రానా. తర్వాత రానా, సాయి పల్లవిలు విరాట పర్వం గురించి మాట్లాడి ఫొటోలకి ఫోజులిచ్చారు

Miss Ram Charan .. Rana Sorry:

First Time Rana Daggubati Says Sorry To Ram Charan Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs