ప్రభాస్ ఇప్పుడు ట్రేండింగ్ లో ఉన్న పేరు. పాన్ ఇండియా స్టార్, క్రేజీ హీరో ప్రభాస్ అంటే ఎప్పుడు ట్రేండింగ్ అయినా.. ఇప్పుడు మాత్రం బరువు తగ్గి స్టైలిష్ లుక్ లో ప్రభాస్ ఫాన్స్ నే కాదు, మూవీ లవర్స్ అందరిని ఎంట్రాక్ట్ చేసేసారు. ఈ రోజు ప్రభాస్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. అయితే అలా సోషల్ మీడియా లో ప్రభాస్ ని ట్రెండ్ అయ్యేలా చేసి ఫాన్స్ ని సంతోష పెట్టిన చేసిన ఫోటో గ్రాఫర్స్ ప్రభాస్ ఫొటోస్ క్లిక్ మనిపించడానికి ఓ నైట్ అంతా ఓం రౌత్ ఇంటి ముందు వెయిట్ చెయ్యడమే హాట్ టాపిక్ గా మారింది.
అసలు విషయం ఏమిటి అంటే.. ఓం రౌత్ గత రాత్రి తన ఇంటి దగ్గరే ఆదిపురుష్ స్టార్స్ కి, టెక్నీకల్ టీం కి గ్రాండ్ పార్టీ ఆరెంజ్ చేసారు. ఆ పార్టీకి ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్.. ఇంకా ఆదిపురుష్ టీం హాజరవగా.. రాత్రంతా పార్టీలో ఉన్న ప్రభాస్ నైట్ అక్కడే స్టే చేసి ఉదయమే.. ఓం రౌత్ ఇంటి నుండి బయలుదేరుతుంటే.. మీడియా ప్రభాస్‌ను చుట్టుముట్టింది. ప్రభాస్ కార్ ఎక్కి వెళ్లిపోతుంటే.. సార్ ఆగండి.. రాత్రంతా ఇక్కడే వెయిట్ చేసాం.. ప్లీజ్ ప్లీజ్ అంటూ మీడియా, ఫోటో గ్రాఫర్స్ రిక్వెస్ట్ చెయ్యడంతో ప్రభాస్ కాసేపు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చాడు. అలా ప్రభాస్ క్లిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయన్నమాట.