సాహో టైం నుండే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. రాధే శ్యామ్ సినిమాలోనూ ప్రభాస్ లుక్స్ పై ఈ విమర్శల టాపిక్ నడిచింది. బాహుబలి దగ్గర నుండి ప్రభాస్ బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. పర్సనల్, టాప్ ట్రైనర్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేసినా ఫిజిక్ లో ఎలాంటి మార్పు లేదు. దానితో ప్రభాస్ ఫాన్స్ చాలా డిస్పాయింట్ అవుతున్నారు. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ లుక్ చేంజ్ కోసం, బరువు తగ్గేందుకు విదేశాలకు వెళ్లారని అన్నారు.
కానీ సలార్ సెట్స్ లో ప్రభాస్ ని చూస్తే ఎప్పటిలాగే కనిపించారు. తాజాగా ప్రభాస్ లుక్ లో విపరీతమైన చేంజ్ చూసి ఫాన్స్ ఖుషి అవుతున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో కలిసి ప్రభాస్ ముంబైలో ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ లో పాల్గొనబోతున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో ప్రభాస్ బరువు తగ్గి చాలా హ్యాండ్ సం గా కనిపించారు. ఓం రౌత్ తో ప్రభాస్, ప్రభాస్ సోలో స్టిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ కి డబ్బింగ్ చెప్పడానికి ముంబై వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అలా ప్రభాస్ స్మార్ట్ లుక్ బయటికి రావడంతో ఆ లుక్ చూసిన ఫాన్స్ కూల్ అవుతున్నారు.