రామ్ చరణ్ - ఉపాసన స్టార్ కపుల్. నేడు జులై 14th చరణ్ - ఉపాసన పెళ్లి రోజు, రామ్ చరణ్ ఉపాసనని ప్రేమించి పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. మెగా ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టిన ఉపాసన అటు చరణ్ కి మంచి భార్యగా, ఇటు కొణిదెల ఫ్యామిలీ కోడలిగా తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తూనే అపోలో హాస్పిటల్ పనులని చూసుకుంటూ సూపర్ విమెన్ గా మారింది. బిజినెస్ వ్యవహారాలతో పాటుగా ఉపాసన ఫ్యామిలీ లో జరిగే ప్రతి వెకేషన్ ని సెలెబ్రేట్ చేస్తుంది. దొనకొండ కోటలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న రామ్ చరణ్ - ఉపాసన తమ పదవ పెళ్లి రోజుని మాత్రం విదేశాల్లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
నాలుగు రోజుల క్రితమే పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ కోసం వెకేషన్స్ కి ఫ్లోరెన్స్ వెళ్ళిన చరణ్ - ఉపాసనలు తమ ఎంజాయ్మెంట్ ని ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇంత అందమైన జంటకి పిల్లలు లేని లోటు తప్ప అంతా హ్యాపీ నే. అది కూడా ఉపాసన తమకి ఎప్పుడు ఇష్టమో అప్పుడే పిల్లలని కంటామంటూ క్లారిటీ ఇస్తూనే ఉంటుంది. ఇక ఉపాసన తాజాగా భర్త రామ్ చరణ్ కి థాంక్స్ చెప్తూ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. So much to be thankful for 🤗🙏❤️ @alwaysramcharan #ur10 అంటూ ఆ టాపిక్ ని షేర్ చేసింది ఉపాసన.