బాలీవుడ్ పొడుగుకాళ్ల బ్యూటీ దీపికా పదుకునే ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే తో సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. డిసెంబర్ నుండే ప్రాజెక్ట్ కే షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చింది. తర్వాత మళ్ళీ బాలీవుడ్ మూవీ షూటింగ్స్ తో దీపికా పదుకొనే బిజీ అయ్యింది. గత నెలలో ప్రాజెక్ట్ షూటింగ్ లోకి మరో బాలీవుడ్ భామ దిశా పటాని జాయిన్ అయ్యింది. అయితే తాజాగా ప్రాజెక్ట్ కే షూటింగ్ కోసం మళ్ళీ దీపికా పడుకొనే హైదరాబాద్ కి వచ్చింది.
అయితే ఇక్కడికి వచ్చిన దీపికా పదుకొనె హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్ లో జాయిన్ అవడం హాట్ టాపిక్ గా మారింది. దీపికకి హార్ట్‌బీట్ పెరగడంతో వెంటనే దీపికా కామినేని ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు దీపికా కి టెస్ట్ లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా దీపికా పడుకొనే హెల్త్ స్టేటస్ తెలియాల్సి ఉంది. దీంతో ఆమె కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్ధిస్తున్నారు