Advertisement
Google Ads BL

మెగాపార్టీలో అక్కినేని హీరో


గత రాత్రి అంటే శనివారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన మెగా పార్టీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరు తన ఫ్రెండ్ కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సక్సెస్ అవడంతో కమల్ అండ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ లు హైదరాబాద్ వస్తున్నారని తెలిసి చిరు ఆయన ఇంట్లోనే అదిరిపోయే పార్టీ ప్లాన్ చేసారు. కమల్ హాసన్ ఓ హోటల్ లో విక్రమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ పూర్తి చేసుకుని చిరు ఇంటికి వెళ్లగా చిరంజీవి కమల్ హాసన్ ని, లోకేష్ ని సాదరంగా ఆహ్వానించారు. ఆయన ఫ్యామిలీ హీరోలైన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అలాగే చిరుపెద్ద కూతురు సుష్మితలు కమల్ తో కరచాలనం చేసారు. 

Advertisement
CJ Advs

చిరు మానవరాళ్లయితే కమల్ కి దణ్ణం పెళ్లి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఇక ఈ పార్టీకి స్పెషల్ గెస్ట్ గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. మెగా ఫ్యామిలీతో సరదాగా గడిపిన కమల్ కి చిరు అతిధి సత్కారాలు చేసారు. ఈ పార్టీలో అక్కినేని హీరో అఖిల్ మెరవడం హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ మెగా పార్టీలో జాయిన్ అయ్యి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే హీరో నితిన్ కూడా ఈ పార్టీలో కనిపించాడు. మెగాస్టార్ చిరు, కమల్, సల్మాన్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అఖిల్, నితిన్ సింగిల్ ఫ్రెమ్ లో కనిపించేసరికి ఫాన్స్ అంతా ఖుషి అవుతున్నారు.

Akhil Akkineni at Mega party:

Chiru, Kamal, Salman sensation thrills all
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs