Advertisement
Google Ads BL

ప్రత్యూష మరణం.. మెగా కోడలి భావోద్వేగం


నిన్న శనివారం హైదరాబాద్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ళ ఆత్మహత్య సినీ సెలబ్రిటీస్ లో కలకలం రేపింది. సినిమా ప్రపంచంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గా మంచి గుర్తింపు అందుకున్న ప్రత్యూష అటు బిజినెస్ మేన్స్ తోనూ మంచి తత్సంబందాలు ఉన్నాయి. నిన్న ప్రత్యూష ఆమె ఫ్లాట్ లోనే బాత్ రూమ్ లో అచేతనంగా పడి ఉండడాన్ని గమనించిన వాచ్ మెన్ పోలీస్ లకి, బంధువులకి, ఆమె పేరెంట్స్ కి సమాచారం ఇవ్వగా.. పోలీస్ లు వచ్చి ప్రత్యూష ది ఆత్మహత్య అని, అలాగే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ప్రత్యుష భౌతికకాయాన్ని పోస్ట్ మార్టం కి తరలించారు. ప్రత్యుష తల్లితండ్రులు ఢిల్లీ లో ఉండడంతో ఆమె మృతదేహాన్ని ప్రవేట్ హాస్పిటల్ లోని మార్చురిలో ఉంచారు. ప్రత్యూష మరణం పట్ల అనేకమంది సెలబ్రిటీస్ విచారం వ్యక్తం చేసారు.

Advertisement
CJ Advs

కాగా మెగా కోడలు ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన ప్రత్యూష కి మంచి ఫ్రెండ్. ప్రత్యుష మరణంతో ఉపాసన చాలా ఎమోషల్ అయ్యింది అనే విషయం ఆమె ట్వీట్ చూస్తే తెలుస్తుంది. భర్త రామ్ చరణ్ తో కలిసి యూరప్ ట్రిప్ కి వెళ్లి అక్కడ తమ పదవ పెళ్లి రోజుని సెలెబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఉపాసనకు ప్రత్యూష మరణ వార్త తెలియడంతో ఆమె భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తుంది. నా బెస్టీ మై డియరెస్ట్ ఫ్రెండ్ ప్రత్యూష చాలా త్వరగా వెళ్లిపోయింది. నిజంగా ఇది విచారమైన సంఘటన. ఆమె కెరీర్ లో స్నేహితులు, కుటుంబంలో ఇలా అందరిలో మంచి పేరున్న అమ్మాయి. అయినప్పటికీ నిరాశకు లోనైంది.. తాను కూడా కర్మని నమ్ముతాను అంటూ ఉపాసన చేసిన ట్వీట్ వైరల్ అవ్వగా.. ప్రత్యూష మారణం పై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రత్యూష నిజంగానే డిప్రెషన్ కి లోనైందా.. లేదంటే మరేదన్నా ఆమె మృతికి కారణమా అనే విషయాన్ని పోలీస్ లు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Upasana emotional tweet on Pratyusha suicide:

Fashion Designer Pratyusha Commits Suicide 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs