కెజిఎఫ్ చాప్టర్1, చాప్టర్ 2 తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన యశ్ తదుపరి సినిమా పై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నర్తన్ అనే దర్శకుడితో యష్ తదుపరి మూవీ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాకి యాష్ హీరోనే కాదు, నిర్మాత గానూ ఉండబోతున్నారట. గతంలో నర్తన్ తో యాష్ ఓ మూవీ చేసి సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు రిపీట్ కాబోతున్న కాంబోపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు యశ్ తో ఈ మూవీలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని అనుకుంటున్నారట.
ఇప్పటికే పాన్ ఇండియా హీరోయిన్ గాను, తెలుగు, తమిళ, హిందీ మూవీస్ తో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే అయితే యశ్ పక్కన పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని యశ్ తో పాటుగా దర్శకుడు నర్తన్ అనుకుంటున్నారట. మరి నిజంగా ఈ లక్కీ ఛాన్స్ పూజ హెగ్డే కి దొరికితే ఆమె లక్కు మాములుగా ఉండదు. ఇప్పటికే మూడు ప్లాప్స్ ఉన్న పూజ హెగ్డే కి మళ్ళీ విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ దొరికింది. విజయ్ తో పూజ హెగ్డే JGM లో నటిస్తుంది. ఇంకా హిందీలో రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ తో సినిమాలు చేస్తుంది. అలాగే తెలుగులో మహేష్ తో మూవీ చేస్తుంది.