Advertisement
Google Ads BL

నయన్-విగ్నేష్: క్షమాపణలతో సరిపెట్టారు


గత రెండు రోజులుగా మీడియా లో హాట్ టాపిక్ ఏముంది అంటే అది నయనతార పెళ్లి, తిరుపతిలో కాంట్రావర్సీ. నయనతార పెళ్లి ఈ గురువారం ఉదయం మహాబలిపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. చాలామంది సెలబ్రిటీస్ పాల్గొన్న ఈ పెళ్లి లో నయనతార - విగ్నేష్ శివన్ లు పెళ్లి బట్టల్లో మెరిసి మురిసిపోయారు. ఇక పెళ్లి తో గురువారం మొత్తం మీడియా, సోషల్ మీడియాని ఆక్యుపై చేసిన ఈ జంట నిన్న శుక్రవారం తిరుపతిలో శ్రీవారి దర్శనంతో మరోసారి హైలెట్ అయ్యారు. శ్రీవారి సన్నిధిలో పూజలు నిర్వహించిన నయనతార - విగ్నేష్ శివన్ ల జంట ఆ తర్వాత మాఢవీధుల్లో ఫోటో షూట్ చేయించుకున్నారు. 

Advertisement
CJ Advs

అంతా బాగానే ఉన్నా.. మాడవీధుల్లో నయనతార చెప్పులు ధరించి ఫోటో షూట్ చెయ్యడం పై టిటిడీతో పాటుగా శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు, నయనతార పై టీటీడి న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యింది. అసలు అక్కడ ఫొటోలు తీయ‌డం, చెప్పులు వేసుకుని తిరగడం అనేది నిషిద్ధం. కానీ అక్కడ నయన్- విగ్నేష్ దంపతులు రూల్స్ ఫాలో కాకపోవడంతో వీరికి నోటీసులు జారీ చేసింది TTD.  ఇదంతా మీడియాలో హడావిడి చేసిన న్యూస్. దానితో నయన్ భర్త విగ్నేష్ శివన్ జరిగిన తప్పుకు క్షమాపణలు కోరుతూ టీటీడీ కి ఓ లెటర్ రాశారు. 

చెప్పులు వేసుకుని తిరగడం అనేది తెలియ‌కుండా జ‌రిగిన పొర‌పాటే త‌ప్ప‌.. కావాల‌ని చేసింది కాదని, తిరుపతి వేంకటేశ్వరుడు అంటే తమ కుటుంబానికి ఎంతో భ‌క్తి అని, నాకు, నయన్‌కు తిరుమల బాగా కలిసి వచ్చిన పుణ్యక్షేత్రం. అసలు నిజానికి మేం తిరుమ‌ల‌లోనే పెళ్లి చేసుకోవాల‌నుకున్నాం. కానీ కొన్ని కారణాలతో తిరుపతిలో కాకుండా మ‌హాబ‌లిపురంలో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి త‌ర్వాత నేరుగా స్వామి ద‌ర్శ‌నానికే వ‌చ్చాం. తిరుమ‌లలో మేం రాగానే జ‌నం ఎక్కువ‌గా రావడంతో వారి నుంచి ప‌క్కకు వ‌చ్చే క్ర‌మంలో తెలియ‌క మాడ వీధుల్లోకి వ‌చ్చేశాం.. క్ష‌మించండి అంటూ విగ్నేష్ శివన్ ఆ లెటర్ లో రాసుకొచ్చారు. 

Vignesh Shivan Apology Letter to TTD:

<span>Nayanthara - Vignesh shivan says sorry to TTD on their recent issue</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs