Advertisement
Google Ads BL

పవన్ తో సల్మాన్ ఖాన్.. హరీష్ శంకర్ క్లారిటీ


గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించబోతున్నారు.. ఇప్పటికే మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ మూవీలో నటిస్తున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు తమ్ముడు కోసం రాబోతున్నాడు. అది కూడా పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కబోతున్న భవదీయుడు భగత్ సింగ్ లో అంటూ ఓ వెబ్ సైట్ లో ఎస్ క్లూసివ్ వార్త రావడం.. అది కాస్తా వైరల్ అవడంతో హారిష్ శంకర్ సదరు వెబ్ సైట్ ని టాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ తో సల్మాన్ ఖాన్ మేటర్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. 

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ లో సల్మాన్ ఖాన్ నటించడమనేది రూమర్ మాత్రమే.. అందులో నిజం లేదు, ఇలాంటి వార్తలు రాసే ముందు కన్ ఫర్మ్ చేసుకుంటే బావుంటుంది అంటూ హరీష్ శంకర్ ఘాటుగానే రిప్లై చేసాడు. మామూలుగానే హరీష్ శంకర్ పై ఏదైనా వార్త వెబ్ సైట్స్ లో వచ్చింది, అది నెగెటివ్ న్యూస్ అంటే ఆయన వాటిపై సెటేరికల్ గా కామెంట్ చెయ్యడమో, లేదంటే ఘాటుగా స్పందించడమో చేస్తాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ - సల్మాన్ ఖాన్ మూవీ అంటూ వస్తున్న వార్తలకు హారిష్ శంకర్ తన ట్వీట్ తో అలా ఫుల్ స్టాప్ పెట్టేసారు. ఇక పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చెయ్యాల్సిన భవదీయుడు భగత్ సింగ్ మూవీ ఆగష్టు నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

Salman Khan will not be starring in Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh :

Director Harish Shankar Clarification On Salman Khan In Pawan Kalyan Next With Mythri Movie Makers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs