Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ మరోసారి బుక్ అయ్యాడు


అల్లు అర్జున్ కి హీరోగా విపరీతమైన క్రేజ్ ఉంది. పుష్ప సినిమా తో అది కాస్తా పాన్ ఇండియా లెవల్ కి పెరిగిపోయింది. పుష్ప పార్ట్ వన్ తోనే పాన్ ఇండియా మార్కెట్ ని దడదడ  లాడించాడు. ఆ దెబ్బకి అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూ బాగా పెరగడంతో ఆయన క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని అల్లు అర్జున్ తో అనేక ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అందుకు సంబంధించిన యాడ్స్ లో అల్లు అర్జున్ నటించారు. అయితే అల్లు అర్జున్ ఈ యాడ్స్ విషయంలో ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. ర్యాఫిడో బైక్ అప్పుడు సిపి సజ్జనార్.. అల్లు అర్జున్ ఉద్దేశ్యపూర్వకంగా RTC ని కించపరిచారంటూ నోటీసు లు ఇచ్చారు.

Advertisement
CJ Advs

ఆ తర్వాత జొమాటో యాడ్ విషయంలో సౌత్ సినిమాలను కించపరిచారంటూ రాద్ధాంతం చేసారు. ఇప్పుడు చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అల్లు అర్జున్ కి మరో సమస్య ఎదురైంది. తాజాగా శ్రీ చైతన్య విద్యా సంస్థల కోసం ఓ యాడ్ చేసారు. ఆ యాడ్ తప్పుదోవ పట్టించేలా ఉంది అంటూ సామాజికి కార్యకర్త కొత్త ఉపేందర్‌రెడ్డి ఆరోపించడమే కాదు ఆయన అల్లు అర్జున్, శ్రీ చైతన్యా విద్యా సంస్థలపై పోలీస్ లకి ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. జూన్ 6th న శ్రీ చైన్య విద్యా సంస్థల నుండి ఓ యాడ్ బయటికి వచ్చింది. అందులో శ్రీ చైతన్యకు సంబంధించిన ఐఐటీ(IIT), ఎన్‌ఐటీ(NIT) ర్యాంకుల ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనల్లో ఇచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తవమని, ఆ తప్పుడు ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని, ఆ యాడ్ లో నటించిన అల్లు అర్జున్ పై కూడా ఆయన ఫిర్యాదు చేశాడు. 

Allu Arjun as brand ambassador of Sri Chaitanya:

Case filed Allu Arjun over Sri Chaitanya IIT, NIT rank advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs