Advertisement
Google Ads BL

బిగ్ బాస్ విన్నర్ సన్నీ పై రౌడీ షీటర్ దాడి


జీ తెలుగులో కల్యాణ వైభోగమే సీరియల్ ద్వారా తానేమిటో ప్రూవ్ చేసుకున్న వీజే సన్నీ.. బిగ్ బాస్ సీజన్ 5 లో షణ్ముఖ్ బ్యాడ్ లక్ కారణంగా విన్నర్ అయ్యి హౌస్ నుండి బయటికి వచ్చిన సన్నీ.. ఆ తర్వాత వరస సినిమా ఆఫర్స్ తో బాగా బిజీ అయ్యాడు. మానస్ ఫ్రెండ్ షిప్, మచ్చా అంటూ కామెడీ చెయ్యడం వీజే సన్నీ స్పెషల్. ఇక బిగ్ బాస్ క్రేజ్ తో సినిమాలు చేస్తున్న వీజే సన్నీ పై సినిమా షూటింగ్ స్పాట్ లో ఓ రౌడీషీటర్ దాడికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది.

Advertisement
CJ Advs

తాజాగా సన్నీ హైదరాబాద్ సమీపంలోని హస్తినాపురంలో ఓ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సన్నీ మేకప్ వేసుకుని షూటింగ్ స్పాట్ కి చేరుకోగా.. అక్కడికి మెరుపులా వచ్చిన ఓ రౌడీ షీటర్ సన్నీ పై దాడికి యత్నించగా, వెంటనే అక్కడే ఉన్న మూవీ యూనిట్ సన్నీని షూటింగ్ నుంచి బయటికి తీసుకువచ్చి కారులో పంపించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సన్నీ సకలగుణాభిరామ సినిమాతో పాటుగా డైమండ్ రత్నం బాబు దర్శకత్వంలో ఓ మూవీని ఈ మధ్యనే స్టార్ట్ చేసాడు.

Rowdy sheeter attack on Bigg Boss Winner Vj Sunny:

Rowdy sheeter attack on Bigg Boss winner vj sunny in cinema sets
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs