తెలుగులో మహేష్ బాబు తో మురారి సినిమాలో నటించిన సోనాలి బింద్రే.. అటు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లోనూ, ఇటు చిరు, బాలయ్యలాంటి హీరోల సినిమాల్లోనూ నటించింది. సోనాలి సినిమాల్లో నటిస్తున్న టైం లోనే ఆమెకి క్యాన్సర్ సోకడంతో గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటుంది. కొద్ది రోజులుగా పూర్తి ట్రీట్మెంట్ తో కోలుకున్న సోనాలి బింద్రే సౌత్ లోకి ఎన్టీఆర్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అనే టాక్ నడుస్తుంది. అయితే సోనాలి బింద్రే సిల్వర్ స్క్రీన్ కి రీ ఎంట్రీ ఇవ్వడం కన్నా ముందుగా బుల్లితెర మీద సెటిల్ అయ్యే ప్లాన్ చేసుకుంది. అందులో భాగంగానే ది బ్రోకెన్ న్యూస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సోనాలి దాని ప్రమోషన్స్ లోనే సౌత్ vs నార్త్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ vs సౌత్ అంటూ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో హీరోల మధ్యన వార్ జరుగుతుంది. కొంతమంది పాన్ ఇండియా ఏమిటి.. అంతా ఇండియన్ మూవీ అంటుంటే.. కొంతమంది నార్త్ ఇండస్ట్రీ గొప్ప అంటూ మాట్లాడుతున్నారు. అయితే తాజాగా సోనాలి బింద్రే మాట్లాడుతూ.. నాకు తెలిసి ఈమధ్యన రిలీజ్ అవుతున్న మూవీస్ అన్ని భాషల ఆడియన్స్ ని మెప్పిస్తున్నాయి. కథలు నచ్చబట్టే సినిమాలు ఆడుతున్నాయి, ప్రేక్షకులు చూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ నే తీసుకోండి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆ సినిమా కోసం చాలా కష్ట పడ్డారు. ఇప్పుడు ఆ సినిమా సక్సెస్ ని ఆస్వాదిస్తున్నారు. సౌత్ అండ్ నార్త్ అంటూ చేసే డిబేట్ పక్కనబెడితే.. మనమంతా ఇండియన్స్. ఏదైనా సినిమా సక్సెస్ అయితే అందరం దానినుండి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఆడియన్స్ హడవితో థియేటర్స్ కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చినందుకు అందరం సెలెబ్రేట్ చేసుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది సోనాలి బింద్రే.