Advertisement
Google Ads BL

పెళ్లిపై మొదటిసారి విగ్నేష్ శివన్ స్పందన


నయనతార - విగ్నేష్ శివన్ ల ఏడేళ్ల ప్రేమ రేపు జూన్ 9 న గురువారం నాడు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది. తమ పెళ్ళికి రావాలంటూ నయన్ - విగ్నేష్ శివన్ లు చెన్నై లోని సెలబ్రిటీస్ ని కలిసి ఆహ్వానించడమే కాదు, సీఎం స్టాలిన్ ని ఆహ్వానించడం హైలెట్ అయ్యింది. అలాగే మహాబలిపురంలో పెళ్లి కి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా నయన్, విగ్నేష్ లు పెళ్లి విషయం పై ఓపెన్ అవ్వడం లేదు, మీడియాకి సమాచారం ఇవ్వలేదు. అయితే విగ్నేష్ శివన్ మొదటిసారి రేపు పెళ్లి జరిగే విషయంపై రియాక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. తాను నయనతార రేపు మహాబలిపురంలో వివాహం చేసుకోబోతున్నామని.. 

Advertisement
CJ Advs

కాకపోతే తమ పెళ్ళికి మళ్ళీ పెరుగుతన్న కరోనా కేసుల దృష్ట్యా ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉందని, ముందుగా తాము తిరుపతిలో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము, కానీ తిరుమలకు సెలబ్రిటీలు రావడం అనేది కాస్త ఇబ్బందికర అంశం అని భావించి పెళ్లి వేదిక మార్చామని, అలాగే  సామాన్య భక్తులకు కూడా ఇబ్బంది అవకాశం ఉండడంతో పెళ్లి వేడుకను మహాబలిపురానికి మార్చామని చెప్పిన విగ్నేష్ జూన్ 9 ఉదయం పెళ్లి జరుగుతుందని, మధ్యాహ్నానికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు మీకు షేర్ చేస్తామని చెప్పినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా జూన్ 11 న నయనతార తాను అందరి ముందుకు వచ్చి కలిసి ఆశీస్సులు తీసుకుంటామంటూ విఘ్నేష్ ప్రకటించినట్లుగా కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. 

Vignesh Shivan confirms wedding with love of my life Nayanthara:

Nayanthara - Vignesh Shivan wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs