Advertisement
Google Ads BL

అంటే.. అదెక్కడి విడ్డూరమండీ..


జగన్ తో గొడవ పెట్టుకున్న వాళ్లంతా ఓ చోట కలిస్తే జగన్ కి ఏపీలో తిరిగే దమ్ము ఉంటుందా.. ఇది టిడిపి, జనసేన, ఇతరుల ప్రశ్న. సినిమా ఇండస్ట్రీలోని మెగాస్టార్, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల కట్టకట్టుకుని వెళ్లి జగన్ తో మీటింగ్ పెట్టి వంగి వంగి దండాలు పెట్టి వచ్చారు. ఏమైంది.. వాళ్ళ లో రాజమౌళి సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ ఢమాల్ మన్నాయి. ఇక గత ఏడాది శ్యామ్ సింగ రాయ్ టైం లో టికెట్ రేట్స్ గురించి మాట్లాడిన నాని పై ఏపీలో ప్రస్తుతం మాజీ మినిస్టర్స్ కొడాలి నాని, పేర్ని నాని మాకు హీరో నాని అంటే ఎవరో తెలియదు.. మాకు తెలిసింది, కొడాలి, పేర్ని నానీలే అన్నారు. అప్పట్లో నానిని వైసిపి వాళ్ళు దారుణంగా ట్రోల్ చేసారు. 

Advertisement
CJ Advs

ఇక పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్ లో వైసిపి ప్రబుత్వం సినిమా ఇండస్ట్రీని చంపేస్తుంది అనగానే ఏపీ మినిస్టర్స్ అంతా పవన్ పై పొలోమని పడిపోయారు. రీసెంట్ గాను నాని అంటే సుందరానికి ప్రమోషన్స్ లో టికెట్ రేట్స్ ఇష్యుపై మాట్లాడాడు. అయితే నాని అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. అది మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్. పవన్- హరీష్ కలయికలో మైత్రిలో మూవీ తెరకెక్కబోతుంది. అలాగే అంటే సుందరానికి మేకర్స్ మైత్రి వారే కావడంతో పవన్ ని పిలిచి అంటే సుందరానికి హైప్ తేవాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. 

కానీ పవన్, నాని ఈవెంట్ కి రావడంతో వైపీసీ సపోర్ట్ వెబ్ సైట్స్, వైసిపి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఓర్చుకోలేక జగన్ కి వ్యతిరేఖంగా మాట్లాడిన హీరోలు ఒకే స్టేజ్ పై అంటూ టైటిల్ పెట్టి మరీ వెటకారం చేస్తున్నాయి. నిజంగా జగన్ కి వ్యతిరేఖంగా ఉన్న వాళ్లంతా కలిస్తే జగన్ ఎప్పుడో గద్దె దిగేవాడు అంటూ వైసిపి అంటే పడని జనసేన నెటిజెన్స్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది..

Pawan Kalyan to power Ante Sundaranik:

Pawan Kalyan for Ante Sundaraniki pre release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs