మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కాంబోలో క్రేజీ మూవీ గా కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య మూవీ తో నిర్మాతలు, బయ్యర్లు భారీగా నష్టపోయారు. భారీ అంచల నడుమ భారీగా రిలీజ్ అయిన ఆచార్య మూవీ ని ఆడియన్స్ తిరస్కరించారు. క్రేజీ కాంబో అయినా ఆచార్య ని చూడడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. కారణం పెరిగిన టికెట్ ధరలు, అంతకుముందు పెద్ద సినిమాలతో జేబులకు చిల్లులు, ఇంకా సినిమాకి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఆచార్య తో బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. అమెజాన్ ప్రైమ్ లో రెండు వారాలకే వచ్చేసినా ఆచార్యని ఎవరూ పట్టించుకోలేదు కుడా.
అయితే ఆచార్య సినిమాకి నష్టపోయిన బయ్యర్లను కొరటాల శివ, రామ్ చరణ్ కలిసి ఆదుకుంటున్నారని, వారికి కొంత ఎమౌంట్ సెటిల్ చేస్తున్నారనే టాక్ నడిచింది. తాజాగా ఆచార్య డిస్ట్రిబ్యూటర్స్ కి 33 కోట్లమేర సెటిల్మెంట్ జరిగింది అని, రామ్ చరణ్ బయ్యర్లకి సర్ది చెప్పి ఫైనల్ సెటిల్మెంట్ చేసారని, చిరు తర్వాత సినిమాలను కూడా వాళ్ళకే ఇచ్చేలా మాట్లాడి ఒప్పించారని తెలుస్తుంది. వరంగల్ శ్రీను ఆచార్యని ఏకంగా 42 కోట్లు పెట్టి నైజాం రైట్స్ దక్కించుకోగా.. అతనికి కేవలం 12 కోట్ల రాబడి ఉంది.. మిగతా 30 కోట్లు నష్టపోయాడు. ఇలా ఈ లిస్ట్ లో చాలామంది ఉన్నారు. అందులో ఫైనల్ గా 33 కోట్ల సెటిల్మెంట్స్ జరిగినట్లుగా తెలుస్తుంది.