Advertisement
Google Ads BL

తమన్నా తో గొడవ నిజమే


F3 మూవీ ప్రీ ప్రమోషన్స్, పోస్ట్ ప్రమోషన్స్ లో హీరోయిన్ తమన్నా కనిపించకపోవడంపై పలు అనుమానాలు లేవనెత్తారు నెటిజెన్స్. తమన్నా కి అనిల్ రావిపూడి మధ్యలో విభేదాల కారణంగా తమన్నా F3 ప్రమోషన్స్ లో కనిపించలేదు అని. అదే ప్రశ్నని తాజాగా ABN రాధాకృష్ణ ఓపెన్ విత్ RK లో అనిల్ రావిపూడిని ప్రశ్నించారు. మీకు తమన్నాకి గొడవలు నిజమేనా అని అడగగా.. దానికి అనిల్ రావిపూడి నిజమే తమన్నా తో విభేదాలు వచ్చాయని చెప్పి షాకిచ్చారు.

Advertisement
CJ Advs

F3 లో చాలా ఎక్కువమంది ఆర్టిస్టులతో పని చేసినప్పుడు చిన్నచిన్న ప్రోబ్లెంస్ వస్తూనే ఉంటాయి. తమన్నాతో తనేం పెద్ద గొడవ పడలేదు. ఒకరోజు ఎలాంటి ప్లానింగ్ లేకుండా రాత్రి షూటింగ్‌ ఇంకాస్త పొడిగించాల్సి వచ్చింది. దానితో తమన్నా నేను పొద్దున్నే జిమ్‌ చేసుకోవాలి, టైం లేదు వెళ్లిపోవాలి అనడంతో.. నేను కాస్త హార్ట్ అయ్యాను. ఆ హీట్ రెండురోజులు మా మధ్య నడిచింది. ఆ తర్వాత మళ్లీ కలిసిపోయి ఎప్పటిలాగే మాట్లాడుకున్నాం. వేరే సినిమా షూటింగ్స్‌లో ఉండటం వల్ల తమన్నా F3 ప్రమోషన్స్‌కు రాలేకపోయింది.. అంటూ తమన్నతో గొడవలపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు.

Anil Ravipudi responds to clashes with Tamanna:

Anil Ravipudi Full Clarity On Clash with Tamannaah
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs