Advertisement
Google Ads BL

సీక్వెల్స్ కోసం ఎన్నాళ్ళు వెయిట్ చెయ్యాలి


తమిళనాట ఖైదీ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని మాస్టర్ మూవీ తో అందరి చూపు తనవైపు తిప్పుకున్న లోకేష్ కనగరాజ్ ఖైదీ కి సీక్వెల్ ఉంటుంది అని ప్రకటించారు. కానీ ఖైదీ ని పక్కనబెట్టి మాస్టర్ చేసారు. ఆ తర్వాత కమల్ హాసన్ తో విక్రమ్ తెరకెక్కించి హిట్ కొట్టారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ మూడు సినిమాలని డ్రగ్స్ కి లింక్ చేసారు. ఇక ఖైదీ 2, విక్రమ్ 2 రెండు సీక్వెల్స్ రావాలి. అయితే విక్రమ్ 2 కాకుండా సూర్య - కార్తీ లతో లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 కి లీడ్ ఇచ్చాడు. సీక్వెల్ స్టోరీని కూడా విక్రమ్ కథలోనే కొంత లీక్ చేసాడు.

Advertisement
CJ Advs

అయితే ఖైదీ తర్వాత ఖైదీ సీక్వెల్ వస్తుంది అని ఎక్సపెక్ట్ చేస్తే.. మాస్టర్, విక్రమ్ వచ్చాయి. మరి ఇప్పుడైనా ఖైదీకి సీక్వెల్ మొదలు పెడతావా.. లోకేశు అంటూ ఆయనకి రిక్వెస్ట్ లు పెడుతున్నారు అభిమానులు. ఖైదీ సీక్వెల్‌లో విలన్‌గా సూర్య, హీరోగా కార్తి నటించబోతున్నారు. అన్నదమ్ములు హీరో-విలన్ అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. అయితే లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 కి రెడీగా ఉన్నప్పటికీ అటు సూర్య, కార్తిల మధ్య యాక్షన్ మొదలవడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఎందుకంటే అటు సూర్య, ఇటు కార్తీ ఇద్దరి చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఈలోపు లోకేష్ కనగరాజ్ కూడా విజయ్ తో ఓ మూవీ చేసి వచ్చేలా కనిపిస్తుంది ప్రస్తుత వ్యవహారం.

Suriya-Karthi combo fixed:

Kaithi 2: Suriya will be playing villain role
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs