కమల్ హాసన్ - విజయ్ సేతుపతి - ఫహద్ ఫాసిల్ కలయికలో ఎంతో గ్రాండ్ గా లోకేష్ కానగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ నిన్న శుక్రవారం పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి తమిళంలో సూపర్ హిట్ టాక్ తోనూ, తెలుగులో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కమల్ హాసన్ టెర్రిఫిక్ పెరఫార్మెన్సు, ఫహద్ ఫాసిల్ నటన, అనిరుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, లోకేష్ కానగరాజ్ దర్శకత్వం, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు అన్ని విక్రమ్ లో మేజర్ హైలైట్స్ గా నిలవగా.. కథనంలో పొరబాట్లు, అలాగే స్లో నేరేషన్, విజయ్ సేతుపతి కేరెక్టర్ ని వీక్ చెయ్యడం వంటి అంశాలు విక్రమ్ కి మైనస్ లుగా నిలిచాయి. ఇక తెలుగులో హీరో నితిన్ శ్రేష్ట్ మూవీ బ్యానర్ పై విక్రమ్ ని రిలీజ్ చేసారు. తెలుగు రాష్ట్రాలలో విక్రమ్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఏరియాల వారీగా విక్రమ్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్..
ఏరియా ఫస్ట్ డే కలెక్షన్స్
👉నైజాం 66 లక్షలు
👉సీడెడ్ 27 లక్షలు
👉ఉత్తరాంధ్ర 30 లక్షలు
👉ఈస్ట్ 18 లక్షలు
👉వెస్ట్ 13 లక్షలు
👉గుంటూరు 15 లక్షలు
👉కృష్ణ 14లక్షలు
👉నెల్లూరు 10లక్షలు
AP-TG ఫస్ట్ డే టోటల్ 1.96 కోట్లు(3.70CR~ Gross)