Advertisement
Google Ads BL

NTR31 కి పవర్ ఫుల్ టైటిల్


ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. భార్య లక్ష్మి ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో తారక్ జాలి ట్రిప్ వేశారు. ఈ ట్రిప్ ముగియగానే ఎన్టీఆర్ కొరటాలతో NTR30 షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. కొరటాల - ఎన్టీఆర్ కలయికలో మూవీ ఫినిష్ అయ్యే టైం కి అటు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ తో సలార్ ని చక చకా పూర్తి చేసేసి NTR31 కోసం రెడీ అవుతారు. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో యాక్షన్ ఎంటర్టైనర్ NTR31 తెరకెక్కబోతుంది. NTR31 లుక్ ఈ మధ్యనే తారక్ బర్త్ డే కి రిలీజ్ చెయ్యగా ఆ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Advertisement
CJ Advs

తారక్ ని ఫుల్ మాస్ యాంగిల్ లో ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేయబోతున్నట్లుగా ఆ లుక్ చూస్తే తెలుస్తుంది. అయితే ఇప్పుడు NTR31 టైటిల్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో NTR31 కి ఓ పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నారట. NTR31 కి అసుర లేదా అసురుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. అసుర అనే పిలుపులోనే ఓ పవర్ ఉందని.. ఈ టైటిల్‌ NTR31 కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని, అలాగే NTR31 లుక్ కి మ్యాచ్ అయ్యేలా ఉంది అంటున్నారు. మరి NTR31 టైటిల్ పై ఈ న్యూస్ నిజమవుతుందో లేదా గాసిప్ గా మిగిలిపోతుందో చూడాలి.

Speculation on NTR31 title:

Powerful title locked for NTR31?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs