ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 వస్తుందా అని స్టార్ మా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే స్టార్ మా లో వచ్చే బిగ్ బాస్ ఈసారి ఓటిటి లో వచ్చేసింది. అలా చాలామంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బిగ్ బాస్ మిస్ అయ్యారు. అందుకే సీజన్ సిక్స్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఓటిటి ముగియడం వెంటనే నాగార్జున సామాన్యులకి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి ఎంట్రీ ఉంటుంది ప్రొసీజర్స్ ఫాలో అవ్వమని ప్రోమోతో వచ్చేసారు. ఆగష్టు నుండి కానీ, సెప్టెంబర్ నుండి కానీ బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. ఈలోపు సీజన్ సిక్స్ లోగో లాంచ్ చెయ్యబోతున్నట్టుగా మరో ప్రమో వదిలారు.
ఈ సీజన్ కి నాగార్జున నే హోస్ట్ గా ఉండబోతున్నట్లుగా ప్రోమో తోనే కన్ ఫర్మ్ చేసింది బిగ్ బాస్ యాజమాన్యం. గత మూడు సీజన్స్, ఒక ఓటిటి సీజన్ ని నాగార్జున హోస్ట్ గా అద్భుతంగా నడిపించడంతో ఈసారి కూడా నాగార్జునని బిగ్ బాస్ యాజమాన్యం ఒప్పించారు. ఇక సీజన్ సిక్స్ కి నాగార్జునే కన్ ఫర్మ్ అన్నాక అక్కనేని ఫాన్స్ కి షాక్, నాగార్జున కి షాక్, ఈసారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి హోస్ట్ గా సమంత రాబోతుంది. గతంలో ఓ ఎపిసోడ్ కి అద్భుతమైన హోస్ట్ గా వ్యవహరించిన సమంత ని ఈసారి బిగ్ బాస్ యాజమాన్యం సీజన్ సిక్స్ కి హోస్ట్ గా తీసుకురాబోతుంది అంటూ గాసిప్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అసలు నాగ్ ప్లేస్ లోకి సమంత ఎలా వస్తుంది. అయినా సీజన్ సిక్స్ కి నాగార్జున హోస్ట్ అని ఫిక్స్ అయ్యాక ఇలాంటి సిల్లీ రూమర్స్ ఎలా పుట్టిస్తారో కదా.