బిగ్ బాస్ ఇప్పటివరకు ఐదు సీజన్స్, ఒక ఓటిటి సీజన్ పూర్తి చేసుకుంది. సీజన్ వన్ నుండి టివి, యూట్యూబ్, సినిమా సెలబ్రిటీస్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ఈ సీజన్ 6 లోకి సామాన్యులని ఆహ్వానించింది బిగ్ బాస్. బిగ్ బాస్ లోకి సామాన్యులకి ఆహ్వానం అంటూ ఓ ప్రోమో వదిలారు. బిగ్ బాస్ సీజన్ 6 కి కూడా నాగార్జునని హోస్ట్ గా చేయబోతున్నట్లుగా ఆ ప్రోమోతో కన్ ఫర్మ్ చేసారు. సీజన్లో 6 లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారో అనే విషయంలో ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫలానా యూట్యూబ్ స్టార్, ఫలానా టివి యాంకర్, ఫలానా వెండితెర నటులు అంటూ కొన్ని పేర్లు హైలెట్ అవుతున్నాయి.
అయితే గత కొన్ని సీజన్స్ నుండి బిగ్ బాస్ ని మిస్ అవుతున్న జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష ఈసారి సీజన్ 6 లోకి పక్కాగా వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. టివి సీరియల్ ఆర్టిస్ట్ గా జబర్దస్త్ లోకి అడుగుపెట్టి.. బుల్లెట్ భాస్కర్ టీం లో ఇమ్మాన్యువల్ తో కలిసి స్టేజ్ పై కామెడీ, రొమాన్స్ చేస్తూ హైలెట్ అవుతున్న వర్ష గ్లామర్ పరంగా రష్మీ, అనసూయలని వెనక్కి నెట్టేసేలా ఉంటుంది. అందుకే ఈ భామకి బిగ్ బాస్ భారీ ఆఫర్ ఇచ్చారట. గత సీజన్స్ ని చేజార్చుకున్న వర్ష ఈసారి పక్కాగా సీజన్ సిక్స్ కి వెళ్ళాలి అనుకుంటుందట. చూద్దాం బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ లిస్ట్ లో జబర్దస్త్ వర్ష పేరు ఉంటుందో.. లేదో.. అనేది. మరి వర్ష కాలు పెడితే గ్లామర్ తో ఆమె చేసే రచ్చకి బుల్లితెర ప్రేక్షకులు పడిపోతారేమో చూడాలి.