Advertisement
Google Ads BL

వారం వారం జాతరే


ఇప్పటివరకు ప్రతి శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు పక్కనబెడితే వచ్చే వారం నుండి విడుదల కాబోతున్న సినిమాలు అందరిలో ఆసక్తిని కలుగజేస్తున్నాయి. యంగ్ హీరోస్ వారినికో సినిమా చొప్పున ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఈ వారం అడివి శేష్ మేజర్ మూవీ తో ఆడియన్స్ ముందు రాబోతున్నాడు. విపరీతమైన ప్రమోషన్స్ తో మేజర్ పై అడివి శేష్ అందరిలో సినిమాకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ మాత్రం కలిగించాడు. శేష్ తానే నిర్మించిన సినిమాలా మేజర్ ప్రమోషన్స్ ని మోస్తున్నాడు. అడివి శేష్ లాంటి హీరో ఏ నిర్మాతకైనా వరమనేలా చేసాడు. ఇక ఈ వారం మేజర్ తో మరో గట్టి చిత్రాలు పర భాషల నుండి పోటీకి వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

ఇక ఆ పై వచ్చే శుక్రవారం నాని అంటే సుందరానికి రిలీజ్ కి రెడీ అయ్యింది. అంటే సుందరానికి టీజర్ తో సినిమాపై ఇంపాక్ట్ క్రియేట్ చేసి ట్రైలర్ కోసం వెయిట్ చేసేలా చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మాములుగా లేవు. శ్యామ్ సింగ రాయ్ తర్వాత నాని నుండి వస్తున్న చిత్రం కావడంతో ట్రేడ్ లోను మంచి బజ్ ఉంది. ఇక ఆ పై వారం రానా - సాయి పల్లవి ల విరాట పర్వం రాబోతుంది. బోలెడన్ని రిలీజ్ డేట్స్ చేంజ్ చేసుకుని చివరికి జులై 1 న రిలీజ్ చేద్దామని డేట్ ఇచ్చి.. మళ్ళీ జూన్ 17 న రిలీజ్ చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. రానా నక్సలైట్ గా, సాయి పల్లవి, ప్రియమణి ప్రధాన పాత్రలతో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. సో ఇక మీదట ఆడియన్స్ కి వారం వారం కుర్ర హీరోల సినిమాలతో జాతరే అన్నమాట.

Nani Ante Sundaraniki releasing on June 10th:

Virata Parvam releasing on June 17h
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs