Advertisement
Google Ads BL

జన గణ మన కోసం పూజ హెగ్డే యాక్షన్


ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కోసం సమంత కొన్ని యుద్ధ విన్యాసాలు నేర్చుకుని మరీ నటించింది. ఆ సీరీస్ సమంత ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఇక శృతి హాసన్ క్రాక్ సినిమాలో చేసిన ఫైట్ కి సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫిదా.. అందుకే ప్రభాస్ కి జోడిగా ఛాన్స్ ఇచ్చారు ఆయన. ఇక మలయాళం, తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న సీత రామం కోసం రష్మిక కాశ్మీరీ గర్ల్ లా తుపాకీ పట్టింది. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు పూజ హెగ్డే కూడా చేరబోతున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

అంటే విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న జన గణ మన మూవీ లో పూజ హెగ్డే ని హీరోయిన్ గా ఫైనల్ చేసారని అంటున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోల్జర్ లా కనిపించబోతున్నాడు. ఇప్పుడు పూజ హెగ్డే కూడా జన గణ మన పోరాట ఘట్టాల్లో నటించేందుకు థాయ్ బృందం తో యుద్ధ కళల్లో శిక్షణ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. జన గణ మన లో పూజ పాత్ర యాక్షన్ ఆధారంగా డిజైన్ చెయ్యబడింది అని, అందుకే పూజ హెగ్డే మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం పొందేందుకు శిక్షణ తీసుకుంటుంది. అది పూర్తవ్వగానే జన గణ మన రెగ్యులర్ షూట్ ని పూరి ముంబై లో మొదలు పెట్టనున్నట్లుగా సమాచారం.

Pooja Hegde to perform stunts in Jana Gana Mana:

Jana Gana Mana: Pooja Hegde to train in martial arts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs