Advertisement
Google Ads BL

మోక్షజ్ఞ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ న్యూస్


బాల్కకృష్ణ గత మూడేళ్ళుగా కొడుకు ఎంట్రీ పై అభిమానులలో ఆశలు పెంచుతూనే ఉన్నారు. కానీ మోక్షజ్ఞ మాత్రం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా లేరనేది ఆయన ఫిజిక్ చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. కానీ నందమూరి ఫాన్స్ మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి జూన్ 10 వచ్చేస్తుంది. బాలయ్య బాబు తన పుట్టిన రోజునాడు కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ పై గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చేస్తున్నాయి. కానీ ఆ విషయమై అఫీషియల్ అప్ డేట్ మాత్రం రావడం లేదు.

Advertisement
CJ Advs

అయితే జూన్ పది న ఖచ్చితంగా మోక్షజ్ఞ మూవీ ఎంట్రీపై అధికారిక ప్రకటన నందమూరి ఫ్యామిలీ నుండి రాబోతుంది అని, బాలకృష్ణ అభిమానుల సాక్షిగా కొడుకు డెబ్యూ సినిమాని ప్రకటించబోతున్నారని అంటున్నారు. ఇక మొదటినుండి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. కానీ పూరి జగన్నాధ్ లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా విజయ్ దేవరకొండ తో జన గణ మన మూవీ చెయ్యాల్సి ఉంది. మరి అవన్నీ ఓ కొలిక్కి వచ్చేలోగా.. మోక్షజ్ఞ ఫిజికల్ గా సినిమా చెయ్యడానికి రెడీ అవుతాడని టాక్ వినిపిస్తుంది. చూద్దాం జూన్ 10 న ఏం జరగబోతుందో అనేది. 

Speculation on Mokshagna debut director?:

Mokshagna debut: Who is directing?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs