బాహుబలి తర్వాత ప్రభాస్ తన లుక్ విషయంలో చాలా ప్రోబ్లెంస్ ఫేస్ చేస్తున్నారు. లుక్ విషయంలో ఫాన్స్ ని శాటిస్ ఫై చేయలేకపోతున్నారు. ఆయన నటించిన సాహో, రాధే శ్యామ్ ఈ రెండు సినిమాల ప్లాప్స్ లో ప్రభాస్ లుక్ మెయిన్ మైనస్ గా నిలిచింది. అటు ఫిజిక్ విషయంలోనూ ప్రభాస్ జిమ్ పర్ఫెక్ట్ గా లేదనే విమర్శలు. ఎంతగా టాప్ ట్రైనర్ ని పెట్టుకుని వర్కౌట్స్ చేస్తున్నా.. ప్రభాస్ వెయిట్ లాస్ అవడం లేదు. సలార్ లో మాస్ లుక్ లో కనిపిస్తారు కాబట్టి ఓకె. కానీ ప్రోజెక్ట్ కె, ఆదిపురుష్, స్పిరిట్ సినిమాలకైనా ప్రభాస్ లుక్ లో వేరియేషన్ చూపిస్తారని అనుకున్నారు.
రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ వెయిట్ లాస్ అవ్వడానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటున్నారని అన్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ ని చూస్తే లుక్ లో ఎలాంటి చేంజ్ లేదనేస్తారు. రీసెంట్ గా సలార్ సెట్స్ లో జాయిన్ అయిన ప్రభాస్ కొత్త ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పిక్స్ లో ప్రభాస్ తలకి క్లోత్ పెట్టుకుని ఉన్నారు. అలాగే బరువుగాను కనిపిస్తున్నారు.. తప్ప లుక్ లో ఎలాంటి కొత్తదనం కనిపించకపోతేసరికి ప్రభాస్ ఫాన్స్ మళ్ళీ డిస్పాయింట్ అవుతున్నారు.