రేపు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు. కృష్ణ గారు బర్త్ డే అంటే ఘట్టమనేని ఫ్యామిలీకి స్పెషల్. అదే ఘట్టమనేని ఫాన్స్ కి పండుగ రోజు. మహేష్ బాబు తన తండ్రి గారి పుట్టిన రోజునాడు తన సినిమాల నుండి స్పెషల్ లుక్ కానీ, లేదంటే తన సినిమాల పూజా కార్యక్రమాలను కానీ మొదలు పెడుతుంటారు. మరి రేపు మే 31 కృష్ణ గారి పుట్టిన రోజునాడు మహేష్ మొదలు పెట్టబోయే SSMB28 నుండి స్పెషల్ అప్ డేట్ రాబోతుంది అంటూ ప్రచారం జరగడమే కానీ.. SSMB28 యూనిట్ నుండి ఎలాంటి కబురు లేదు.
మరి రేపు SSMB 28 నుండి మహేష్ లుక్ ని త్రివిక్రమ్ రివీల్ చేస్తారా? లేదంటే టైటిల్ ఏమైనా ప్రకటిస్తారా? ఎలాంటి అప్ డేట్ SSMB28 నుండి రాబోతుంది అనేది మహేష్ ఫాన్స్ కి అర్ధం కాక సోషల్ మీడియాలో SSMB28 ని ట్రెండ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. రేపు అసలు అప్ డేట్ ఉంటుందా? లేదో? అనే కన్ఫ్యూషన్ లోనూ ఉన్నారు. మరి త్రివిక్రమ్ మహేష్ ఫాన్స్ కోసం కృష్ణగారి బర్త్ డే కి ఎలాంటి సర్ ప్రైజ్ ప్లాన్ చేసారో అనేది మరికొన్ని గంటల్లో రివీల్ అయ్యిపోతుంది.