అడివి శేష్ నటించిన మేజర్ సినిమా ఈ శుక్రవారమే రిలీజ్ కి రెడీ అయ్యింది. మేజర్ ఉమేష్ చంద్ర లైఫ్ స్టోరీ తో తెరకెక్కిన మేజర్ మూవీపై పాన్ ఇండియా మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. మేజర్ ట్రైలర్ తోనూ, మేజర్ ప్రీమియర్ షోస్ తోనూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. అడివి శేష్ తన టీం తో చేసే ప్రమోషన్స్ తో సినిమాపై పై హైప్ క్రియేట్ అవడమే కాదు, మేజర్ ఉన్ని కృష్ణన్ ముంబై తాజ్ హోటల్ లో తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయి ప్రజల గుండెల్లో హీరోగా గుడి కట్టుకున్నారు. అయితే ఇప్పుడు మేజర్ సినిమాని ఆయన చేసిన పోరాట ఘట్టాల తో ఎక్కువగా నింపారా? లేదంటే అనేది కొందరిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. అంటే మేజర్ మూవీ ట్రైలర్ లో సాయి మంజ్రేకర్ తో లవ్ స్టోరీ ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసినట్లుగా చాలామంది ఫీలవుతున్నారు.
సినిమా మొత్తం, అడివి శేష్ లవ్ స్టోరీ, అలాగే ఫ్యామిలీ సన్నివేశాలను నింపేసి కొంతమేర యాక్షన్ యాడ్ చేసారా? ఉన్నికృష్ణన్ హీరోయిజాన్ని పూర్తిగా హైలెట్ చేస్తారో.. లేదో.. అనే అనుమానాలు యూత్ లో మొదలయ్యాయి. అడివి శేష్ గూఢచారిలో లవ్ స్టోరీ పెట్టినా అది కథలో ఇన్వాల్వ్ అయ్యేలా ఉంది తప్ప ఎక్కడ ప్రాబ్లెమ్ గా మారలేదు. కానీ ఇక్కడ మేజర్ విషయంలో మాత్రం లవ్ స్టోరీ ఎమన్నా ప్రాబ్లెమ్ అయ్యి కథని పక్కదారి పట్టిస్తుందేమో.. కథలో ఆ లవ్ స్టోరీ ఇన్వాల్వ్ కాకపోతే అది బెడిసి కొడుతోంది అనేది కొంతమంది యూత్ అభిప్రాయం.