నిన్నమొన్నటివరకు మహేష్ గురించి చాలామందికి ఏమి తెలియదు. జస్ట్ ఫ్యామిలీ మ్యాన్. సైలెంట్ గా ఉంటారు. బయట ఆయనకి ఫ్రెండ్స్ కానీ పార్టీలు కానీ లేవు అనే అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు, బాలయ్య అన్ స్టాపబుల్ షోస్, ఇంకా కొన్ని ఇంటర్వూస్ లో మహేష్ ఫన్నీ యాంగిల్ కి ఫాన్స్ మాత్రమే కాదు అందరూ ఫిదా అయ్యారు. అలాగే మహేష్ లో ఈమధ్యన మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అందులో ఎప్పుడూ రిజర్వేడ్ గా ఉండే మహేష్ ఫస్ట్ టైం ప్రముఖులతో కలిసి ఏపీ సీఎం జగన్ ని మీటవ్వడం, ఇక రెండోవది.. తన ఈవెంట్స్ లో చాలా ఒబ్బిడిగా మాట్లాడే మహేష్ బాబు ఫస్ట్ టైం స్టేజ్ పై డాన్స్ చెయ్యడం.
ఇవన్నీ మహేష్ లోని కొత్త యాంగిల్ ని చూపిస్తున్నాయి. ఇక తాజాగా తన ప్రొడక్షన్ లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న మేజర్ మూవీ టికెట్స్ కోసం ఏకంగా లైన్ లో నించుకున్నారు మహేష్ బాబు. అడివి శేష్ కి యూట్యూబర్ నిహారిక కి మేజర్ టికెట్స్ కోసం చిన్న గొడవ జరుగుతుంది. ఇది మేజర్ టికెట్స్ క్యూ లైనా అని అడుగుతూ లైన్ లో వెళ్లి ముందు నించుంటుంది. ఆ తర్వాత అడివి శేష్ ఆ లైన్ లో నిహారిక ముందు నించోవడంతో శేష్ తో నిహారిక గొడవపడి శేష్ ని వెనక్కి పంపిస్తుంది. ఆ తర్వాత ఆమె ముందు కు వచ్చి మరో వ్యక్తి నిలబడతారు. ఆయనే మహేష్. మహేష్ ని చూసి మహా ఎగ్జైట్ అవుతుంది నిహారిక. మహేష్ నిహారికతో నా ఫ్రెండ్స్ ని కూడా పిలవొచ్చ అనగానే వారంతా మహేష్ ముందు నిలబడతారు.
నిహారిక ఏం మాట్లాడకుండా మహేష్ నే చూస్తూ అయన ఫోన్ నెంబర్ అడిగేలోగా ఆయన వెళ్ళిపోతారు. ఆ తర్వాత అడివి శేష్ షాక్ అయ్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అక్కడ మహేష్ అలా మేజర్ టికెట్ కోసం ఫన్ చెయ్యడం మాత్రం హైలెట్ అయ్యింది. అంతేకాదు మహేష్ లో మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.