త్రివిక్రమ్ - మహేష్ బాబు సినిమా మరొక్క వారంలో రెగ్యులర్ షూట్ కి వెళ్ళడానికి రెడీగా ఉంది. మహేష్ యూరప్ నుండి రావడమే చిన్న గ్యాప్ తో SSMB28 షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది. దానితో మహేష్ ఫాన్స్ బాగా ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా నందమూరి ప్లాప్ హీరో తారకరత్నని త్రివిక్రమ్ ఫైనల్ చేసారని అన్నప్పటికీ.. తారక రత్న అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేసాడు. ఇక త్రివిక్రమ్ సినిమాల్లో ఒకరు స్టార్ హీరో ఉంటే.. మరొకరిని చిన్న హీరో ని అయినా లేదంటే కథ డిమాండ్ చేస్తే పెద్ద హీరోనైనా తీసుకువస్తుంటారు. సన్నాఫ్ సత్యమూర్తి కోసం కన్నడ ఉపేంద్రని తీసుకు వస్తే.. అలా వైకుంఠపురములో కోసం అక్కినేని కుర్ర హీరో సుశాంత్ ని తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు మహేష్ మూవీలోనూ మరో హీరో ఉంటాడని సోషల్ మీడియా గాట్టిగా ఫిక్స్ అయ్యింది.
అయితే ఇప్పుడు త్రివిక్రమ్ మదిలో మహేష్ కి విలన్ కేరెక్టర్ కోసం ముగ్గురు పవర్ ఫుల్ హీరోలున్నారంటున్నారు. వారే తమిళ హీరో విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని మహేష్ సినిమాలో విలన్ గా నటించేందుకు సంప్రదించాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారట. మరి ఇదైనా నిజమవుతుందో.. లేదంటే ఇది రూమర్ గా మిగిలిపోతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే మహేష్ బాబు తో రెండోసారి నటించబోతుంది.